Share News

High Court: చట్టం కంటే పోలీసులు ఎక్కువేమీ కాదు

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:46 AM

రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు మండిపడింది. నిందితుల అరెస్ట్‌ విషయంలో చట్టనిబంధనలు అనుసరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.

High Court: చట్టం కంటే పోలీసులు ఎక్కువేమీ కాదు

  • వ్యక్తుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకుంటున్నారు

  • ఇలాగే వదిలేస్తే కోర్టులోనే అరెస్టు చేస్తారేమో!

  • వైసీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీధర్‌రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులు రద్దు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు మండిపడింది. నిందితుల అరెస్ట్‌ విషయంలో చట్టనిబంధనలు అనుసరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. చట్టంకంటే పోలీసులు ఎక్కువేమీ కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తుల స్వేచ్ఛను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. పోలీసుల చర్యలను తేలిగ్గా తీసుకుంటే రేపు కోర్టుకు వచ్చి కూడా అరె్‌స్టలు చేస్తారని వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీధర్‌రెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ విజయవాడ మూడో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌(ఎ్‌ఫఏసీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వాటిని చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. మెజిస్ట్రేట్‌ యాంత్రికంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. తాము ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు అడ్డంకి కాబోవని, పోలీసులు చట్టనిబంధనలు ప్రకారం నడుచుకోవచ్చని తెలిపింది. కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది.


ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ద్విసభ్యధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) యతీంద్రదేవ్‌ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 47(1) కింద పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకొనేందుకు నిందితుడునిరాకరించారని తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పప్పుడిపు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అవుతు శ్రీధర్‌రెడ్డిని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా గత నెల 25వ తేదీన జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అయితే, విజయవాడ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ శ్రీధర్‌రెడ్డి సతీమణి జాన్సీ వాణిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Mar 12 , 2025 | 06:46 AM