Students Issue: రేకుల షెడ్లలో విద్యార్థుల వసతి...
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:58 AM
వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వినుకొండ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అద్దెకు తీసుకున్న రేకుల షెడ్లలో సంక్షేమ అధికారులు విద్యార్థులకు వసతి కల్పిస్తున్నా రు. చాలీచాలని ఇరుకు గదుల్లో కనీస సౌకర్యాలు లేక ఉక్కపోతతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ పరిస్థితి వినుకొండలోని ఎస్సీ బాలుర వసతిగృహ విద్యార్థులది. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని వసతిగృహం శిథిలావస్థకు చేరుకోగా వెన్నపూస కాలనీలో రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని విద్యార్థులకు వసతి కల్పించారు. సుమారు వందమందికి పైగా విద్యార్థులు ఉన్న హాస్టల్ గోడౌన్‌కు ఉపయోగించే రేకులు షెడ్లలో నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అద్దె భవనాల్లో అవస్థలు..
వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారంపూడి రోడ్డులోని హీరో హోండా షోరూం వెనుక భాగంలోని ఓ అద్దె రేకుల షెడ్లలో బీసీ బాలికల కాలేజీ హాస్టల్ కొనసాగుతుంది. సుమారు 60 మంది విద్యార్థినులు ఇక్కడ వసతి పొందుతున్నా సరైన సౌకర్యాలు లేవు. 2011లో ప్రారంభమైన కళాశాల హాస్టల్ నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతుంది. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించకపోవడం కళాశాల విద్యార్థినీ విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకునే విద్యార్థులకు వసతులు లేక చదువులు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News