Payyavula Keshav: జగన్‌కు అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేదు
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:23 PM
Payyavula Keshav: వైసీపీ అధినేత జగన్‌కు మతి భ్రమించిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడపడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ కలలు కనడంలో ఇబ్బంది లేదని చెప్పారు. కలలను నిజం అనుకోవడంలోనే ఇబ్బంది ఉందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లాగా మరో 15 ఏళ్లు కలలు కంటూ జగన్ ఉంటారని విమర్శించారు. జగన్ ఆ మాత్రం కలలు కనకపోతే ఆయనకు, కేడర్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. మనస్సుకు సర్ధి చెప్పుకోవడానికి , కేడర్‌కు నమ్మకాన్ని నింపడానికి జగన్ ప్రయాస పడుతున్నారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు. ప్రతిపక్ష హోదాపై గత శాసనసభలో ఏం చెప్పారో గుర్తుంచుకోవాలని అన్నారు. జగన్‌కు అసెంబ్లీనీ ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలా మాట్లాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది: ఎమ్మెల్సీ ఆశోక్ బాబు

అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది... ఇంకా కౌన్సిల్ ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ ఆశోక్ బాబు తెలిపారు. ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న నామినేషన్ ర్యాలీలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానాన్ని ప్రజలు గమనించారని అన్నారు. ఇది కౌరవ సభ రాను.. గౌరవ సభ అయితేనే వస్తానని చంద్రబాబు చెప్పడం.. ఆయనను నమ్మి ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ముద్దాయిలను, నిందితులను, రౌడీషీటర్లను, మహిళలను అపహస్యం చేసిన వారిని ఎమ్మెల్సీగా నియమించిందని విమర్శించారు. వాళ్లు వినేది లేదు.. చెప్పేది లేదు.. ఎవరైనా మాట్లాడితే మొత్తం అందరూ నిలబడి ఇబ్బందులకు గురి చేయడం తప్ప.. వారు చేసేది ఏమి లేదని చెప్పారు. అసెంబ్లీ ఏ రకంగా ప్రక్షాళన అయిందో.. కౌన్సిల్ కూడా అ రకంగా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News