Pawan Kalyan ON Viral Fever: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:31 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో పవన్ కల్యాణ్ ఇబ్బంది పడుతున్నారు.
అమరావతి, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వైరల్ ఫీవర్‌తో (Viral Fever) బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో డిప్యూటీ సీఎం ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతోనే నిన్న (సోమవారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు, కీలక సమీక్షల్లో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం .. పవన్ కల్యాణ్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. తన శాఖలకు సంబంధించి అధికారులతో పవన్ కల్యాణ్ టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతుండటంతో త్వరగా కోలుకోవాలని జనసైనికులు, అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..