Pawan Kalyan On Youth Welfare: రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:54 PM
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
ఇందులో భాగంగా ‘సేనతో సేనాని- మన నేల కోసం కలిసి నడుద్దాం’ అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన (Janasena) నిర్వహించనుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని తెలిపారు. మార్పు కోరుకుంటే రాదని.. మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని
జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం
Read Latest AP News And Telugu News