Nara Lokesh: ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:30 PM
‘అమరజీవి జలధార’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు.
అమరావతి, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ‘అమరజీవి జలధార’పై (Amarajeevi Jaladhara) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (PawanKalyan) ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు స్వచ్ఛమైన జలాలు అందించేందుకు పవన్ కల్యాణ్ చేసిన భగీరథ ప్రయత్నం ఫలించిందని కొనియాడారు. ‘అమరజీవి జలధార’ పథకానికి శ్రీకారం చుట్టి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తున్న పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేశ్.
మంగళగిరి ప్రజల సేవలో ఎప్పుడూ ఉంటా: మంత్రి లోకేశ్
మంగళగిరిలో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో లోకేశ్ మాట్లాడారు. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. పరీక్ష పెట్టే దేవుడు.. వాటిని జయించే శక్తి కూడా ఇస్తారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం
Read Latest AP News And Telugu News