Nara Devansh: నారా దేవాన్ష్‌కు ప్రశంసల వెల్లువ..
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:34 PM
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న నారా దేవాన్ష్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు దేశ విదేశాల్లోని తెలుగువారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో దేవాన్ష్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు, దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారు ఎక్స్ వేదికగా దేవాన్ష్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నారా కుటుంబం సైతం దేవాన్ష్‌పై తమ ప్రేమను వ్యక్త పరిచారు.
శుభాకాంక్షలు ఛాంపియన్.. చంద్రబాబు
ఈ మేరకు తన మనవడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-2025 అవార్డు అందుకున్నందుకు దేవాన్ష్‌కు అభినందనలు తెలిపారు. నెలల తరబడి పట్టుదల, అతని గురువుల మార్గదర్శకత్వంతో 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా దేవాన్ష్ సాధించిన రికార్డు పట్ల తాము గర్విస్తున్నట్లు సీఎం చెప్పారు. 'శుభాకాంక్షలు ఛాంపియన్'.. అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
మరోసారి గర్వపడేలా చేశావు.. లోకేశ్
'నా చిన్న ఛాంపియన్.. నువ్వు మమ్మల్ని మరోసారి గర్వపడేలా చేశావు. వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో నీ అంకితభావం, నిబద్ధత నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి. ఈ గుర్తింపు నీ కృషికి ప్రతిఫలం. ఈ ప్రత్యేక సందర్భంలో నీతో ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది' అని ఎక్స్ వేదికగా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని మైలురాళ్లను సాధించాలి... భువనేశ్వరి
'లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం అందుకున్న నా ప్రియమైన మనవడు దేవాన్ష్‌కు నా ఆశీస్సులు. కేవలం 10 సంవత్సరాల వయసులో చెస్ పట్ల నీ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం మన కుటుంబానికి ఎంతో గర్వకారణం. నీవు ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ.. మరిన్ని మైలురాళ్లను సాధించాలని కోరుకుంటున్నా' అంటూ నారా భువనేశ్వరి తన మనవడిపై ప్రశంసలు కురిపించారు.
నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది.. బ్రాహ్మణి
'దేవాన్ష్.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. కేవలం 10 ఏళ్ల వయసులోనే నీ అంకితభావం, దృష్టి, చెస్ పట్ల ప్రేమ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో నీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. నువ్వు చేసే ప్రతి కదలికలోనూ నీ కృషి ప్రకాశిస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే, పెద్ద కలలు కనడం కొనసాగించు, నా చాంప్'. అంటూ.. ఎక్స్ వేదికగా నారా బ్రాహ్మణి పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..