YS Jagan: సింగయ్య కేసులో జగన్‌కు ఏపీ పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:08 PM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లిలోని ని రెంటపాళ్లలో జగన్ ఈనెల 18వ తేదీన పర్యటించారు. ఈ సమయంలో జగన్ కారు కిందపడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిచెందాడు.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan mohan Reddy) నల్లపాడు పోలీసులు ఇవాళ(మంగళవారం) నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో జగన్ ఈనెల (జూన్) 18వ తేదీన పర్యటించారు. ఈ సమయంలో జగన్ కారు కిందపడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిచెందాడు. సింగయ్య మృతితో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులోనే జగన్‌కు పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన సమయంలో జగన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన జగన్ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. సింగయ్య మృతి కేసులో ఇప్పటికే జగన్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సింగయ్య మృతి కేసులో ఏ2 జగన్ రెడ్డి, ఏ3 నాగేశ్వరరెడ్డి , ఏ4 సుబ్బారెడ్డిని పోలీసులు చేర్చారు.
ఇవి కూడా చదవండి
అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి
జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు
ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్
Read Latest AP News And Telugu News