Share News

DBV Swamy: వారు మారకపోతే తాటతీస్తాం.. మంత్రి బాలవీరాంజనేయస్వామి వార్నింగ్

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:26 PM

Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.

DBV Swamy: వారు మారకపోతే తాటతీస్తాం.. మంత్రి బాలవీరాంజనేయస్వామి వార్నింగ్
Dola Bala Veeranjaneya Swamy

ప్రకాశం: కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులకు పాల్పడటం లేదని మంత్రి బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల్లో మంత్రి బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ... విచారణలో నిజమని నిర్థారణ అయితేనే అరెస్టులు చేస్తున్నామని తెలిపారు.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయాలను కూడా వంశీ, వైసీపీ నేతలు తగులబెట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన మేరకు ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పినా నాయకుల పరిస్థితి మారలేదని అన్నారు. రేపు కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు.


వల్లభనేని వంశీ చరిత్ర మొత్తం అరాచకమయం: మాజీమంత్రి జవహర్

ks-jawahar.jpg

అమరావతి: వైసీపీ నేత వల్లభనేని వంశీ చరిత్ర మొత్తం అరాచకమయమని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. గన్నవరం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో 71వ నిందితుడిగా ఉన్న వంశీ తానంతట తానే వచ్చి కిడ్నాప్ కేసులో ఏ1గా ఇరుక్కున్నారని అన్నారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద సైకో జగన్‌ను సంతృప్తి పరిచేందుకు ఇష్టానుసారం విధ్వంసం సృష్టించారని అన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎస్సీ యువకుడు సత్యవర్థన్‌ను బలిపశువును చేద్దామని చూసి అడ్డంగా దొరికాడని అన్నారు. తన అహంకార ప్రదర్శనకు ఎస్సీ యువకుడిని తక్కువ చులకన చేయాలనుకున్నారని చెప్పారు. వంశీ లాంటి దుర్మార్గులను సంఘ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. వంశీ లాంటి వారు జైల్లో ఉంటేనే సమాజానికి మంచిదని జవహర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bird Flu : కోళ్లకు మరణశాసనం..!

Remand.. వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

Minister Kollu Ravindra : పాపం పండింది!

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:29 PM