Lokesh Wishes to ABN- Andhrajyothy: అక్షరమే ఆయుధంగా.. నిజాయితీకి నిలువెత్తు నమూనా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి: లోకేష్
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:04 PM
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) సంస్థల 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దమ్మున్న ఛానల్..
‘అక్షరమే ఆయుధంగా, సమాజ హితమే లక్ష్యంగా వేమూరి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో వెలిగించిన ఆంధ్రజ్యోతి దినదిన ప్రవర్థమానమై 23 ఏళ్లు, నిజాన్ని నిర్భీతిగా చూపించడంలో దమ్మున్న ఛానల్‌గా పేరుగాంచిన ఏబీఎన్ ప్రారంభమై 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హృదయాలను కదిలించే మానవీయ కథనాలు, అవినీతిపరుల పాలిట సింహ స్వప్నం లాంటి పరిశోధనాత్మక కథనాలు, నిక్కచ్చి రాజకీయ విశ్లేషణలతో తెలుగు వీక్షకులకు అభిమాన పత్రికగా ఆంధ్రజ్యోతి, ఇష్టపడే ఛానల్‌గా ఏబీఎన్ నిలిచాయి’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
నూతన పరిశ్రమలపై ఆసక్తికర ట్వీట్..
మరోవైపు.. అనంతపూర్ జిల్లా (Anantapur Dist)లో నూతనంగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమల గురించి మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏ అంటే అనంతపూర్... అనంతపూర్ అంటే ఏరో స్పేస్, ఆటో మోటివ్ అంటూ హ్యాష్ ట్యాగ్ అనంతపూర్, హ్యాష్ ట్యాగ్ ఎంగేస్ట్ స్టేట్.. హైయస్ట్ ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ ట్వీట్ పెట్టారు మంత్రి నారా లోకేష్.
ఉత్సాహంగా ఉన్నాం..
అనంతపూర్ పేరుపైన విమానం ఎగిరే ఫొటోతో మంత్రి నారా లోకేష్ ట్వీట్ పెట్టారు. రేమాండ్ గ్రూప్ ఏపీలో ఏరో స్పేస్, ఆటో మోటివ్ తయారీలో రూ.1000 కోట్ల పెట్టుబడులనే వార్తలని ట్వీట్ పెట్టారు లోకేష్. ఏపీ ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సీడీలుగా నూతన పారిశ్రామిక, ఏరో స్పేస్ పాలసీ ప్రకటనతో ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. అలాగే, ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ పెట్టారు మంత్రి. సత్యసాయి జిల్లాలో ఈ ట్విన్ ప్రాజెక్టుల ద్వారా 5,400 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News