CM Chandrababu: అమరావతిలో కొత్త ప్రాజెక్టులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్ష్యంలో సోమవారం సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమక్ష్యంలో ఇవాళ(సోమవారం) సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షించనున్నారు సీఆర్డీఏ అథారిటీ.
ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో మాట్లాడారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.
అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే జరీబు- మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది అథారిటీ సమావేశం. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News