Share News

Chandrababu Meets Pawan Kalyan: పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:30 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.

Chandrababu Meets Pawan Kalyan: పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..
Chandrababu Meets Pawan Kalyan

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హైదరాబాద్‌లోని నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వైరల్ ఫీవర్‌ (Viral fever)తో ఇబ్బంది పడుతున్న పవన్‌ను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.


అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి పవన్ వెళ్లారు. అలాగే, తన శాఖలపైనా సమీక్షలు చేశారు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇంకా జ్వరంతోనే పవన్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు

తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 07:04 PM