Share News

CM Chandrababu: బనకచర్లపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 07:55 PM

కొందరు మంత్రులు సక్రమంగా డీఆర్సీ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రుల వైఖరి ఇలా ఉంటే సరికాదని అన్నారు. జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలపై ఇన్‌చార్జ్ మంత్రులు సమీక్షించాలని ఆదేశించారు. హామీల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu: బనకచర్లపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP CM Chandrababu Naidu

అమరావతి: పోలవరం - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ధోరణి వద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ అభిమతమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించారు. సందర్భానుసారంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుని స్నేహపూర్వకంగా సమస్య పరిష్కరించుకుందామని అన్నారు. హామీల అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలను వేరు చేయాలని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


ఆర్థికంగా ముడిపడని హామీలు రెండునెలల్లో అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు డీఆర్సీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొందరు మంత్రులు సక్రమంగా డీఆర్సీ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని సీఎం ప్రశ్నిచారు. మంత్రుల వైఖరి ఇలా ఉంటే సరికాదని అన్నారు. జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలపై ఇన్‌చార్జ్ మంత్రులు సమీక్షించాలని ఆదేశించారు. హామీల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. అనకాపల్లిలో ఆరెస్సాల్ స్టీల్ పరిశ్రమ పనులు అక్టోబర్‌లో ప్రారంభించి తొలిదశను 2028లోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు సీఎం చంద్రబాబు.


విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత జగన్ ప్రభుత్వం అంబేద్కర్ ప్రాజెక్ట్‌ను అసంపూర్తిగా వదిలేసిందని మంత్రులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాను 24/7 అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 15శాతం వృద్ధిరేటు లక్ష్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకుని పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పనుల్లో వేగం పెంచాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సబ్జెక్ట్‌పై ఎంత పట్టు సాధిస్తే అంత వేగంగా అభివృద్ధిని పరుగులెత్తించవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 09:15 PM