CM Chandrababu: రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - May 22 , 2025 | 04:49 PM
CM Chandrababu: డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగయ్యేలా చూసి... రైతులు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. పొగాకు, కోకో పంటలను ఆయా కంపెనీలు కొనుగోళ్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకు మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

అమరావతి: వరీసాగు, ఆయా పంటల సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ అధికారులు దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సూచించారు. పంటలు, గిట్టుబాటు ధరలపై ఇవాళ(గురువారం) సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయో... ఏ పంటలు సాగుచేయాలో రైతులకు ముందే చెప్పాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగయ్యేలా చూసి... రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు రూ.12,000, కోకో కేజీకి రూ.500 ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పొగాకు, కోకో పంటలను ఆయా కంపెనీలు కొనుగోళ్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకు మద్దతు ధర కన్నా తగ్గితే రైతులను నేరుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. హెచ్డీ బర్లే - వైట్ బర్లే పొగాకును టొబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు. రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలీడే ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్యూర్ జ్యూస్‌లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి, మిడ్ డే మీల్స్, టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు..
కాగా, సీఎం చంద్రబాబు ఈరోజు (మే22) సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఇవాళ రాత్రి 9 గంటలకు కేంద్రహోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు(శుక్రవారం) పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై మాట్లాడనున్నారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ
AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News