Share News

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 04 , 2025 | 10:14 AM

ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు.

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

అమరావతి: నాటి ప్రజాతీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు..

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4.... చరిత్ర సృష్టించిన రోజు... ప్రజావిప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు...అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు... సైకో పాలనకు అంతం పలికి.....ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు.. ఉద్యమంలా ప్రజలు ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు... ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు... పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు... ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు.. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు.. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.


విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటం..

‘ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి...సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ కలకలం..

తిరుమల: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

For More AP News and Telugu News

Updated Date - Jun 04 , 2025 | 10:36 AM