Share News

Minister Nara Lokesh: ఏపీ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం: మంత్రి లోకేష్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:01 PM

క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్‌గా మారుతుందని ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్‌ను ఇంజనీరింగ్‌లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

Minister Nara Lokesh: ఏపీ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం: మంత్రి లోకేష్‌
AP Minister Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం ప్రారంభం అవుతోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) ఉద్ఘాటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ (Quantum Computing Valley) అమరావతిని.. టెక్నాలజీ మ్యాప్‌లో చేర్చాలని వ్యాఖ్యానించారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్‌లో ఇవాళ(సోమవారం) వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవెల్యూషన్‌ను పరిచయం చేసినప్పుడు తాను ఏడోతరగతి చదువుకుంటున్నానని గుర్తుచేశారు మంత్రి నారా లోకేష్.


గ్లోబల్ రేస్‌లో చేరడం కాదు.. మనమే దారి చూపాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్‌గా మారుతోందని ఉద్ఘాటించారు. క్వాంటమ్ సైన్స్‌ను ఇంజనీరింగ్‌లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తోందని చెప్పారు. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ , ఇన్నోవేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ లీడర్లు , పెట్టుబడిదారులు తమతో కలసి పనిచేయాలని కోరారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ఉండటం అదృష్టమని ప్రశంసించారు. చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు పెట్టిన ఐటీ రంగం విస్తృతిని గతంలో చూశామని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.


ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడాన్ని.. ప్రత్యక్షంగా చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సౌత్ ఏషియా ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతోందని ప్రకటించారు. అత్యాధునిక 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఐబీఎం ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. లక్షకు పైగా ఐటీ జాబ్స్ క్వాంటమ్ రంగంలో వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ పాలనలో ఏపీ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ఐబీఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతోందని చెప్పుకొచ్చారు. ఇన్నోవేటివ్ , స్టార్టప్‌లకు క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఓ లాంచ్‌పాడ్ అని అభివర్ణించారు. సిలికాన్ వ్యాలీలాగా క్వాంటమ్ వ్యాలీ కూడా గ్లోబల్ సింబల్ అవుతుందని ఉద్ఘాటించారు. చంద్రబాబు నెక్స్ట్ వెర్షన్‌ను చూసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. దేశ టెక్నాలాజికల్ అధ్యాయాన్ని అమరావతి నుంచే ప్రారంభిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్

ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు

For More AP News and Telugu News

Updated Date - Jun 30 , 2025 | 01:08 PM