AP Government ON Employees: వారికి గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:47 PM
సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొదటి విడుత డీఏ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులు అందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అమరావతి, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) తీపికబురు చెప్పింది. మొదటి విడుత డీఏ బకాయిలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులు (CPS Employees) అందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.
సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ. 40వేల నుంచి రూ.70వేల వరకు ఇవాళ(సోమవారం) వారి అకౌంట్లకు జమచేసింది ప్రభుత్వం. మిగిలిన వారికి ఆరు విడతల్లో అంటే ఒక్కో ఉద్యోగికి రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీఏ బకాయిల విడుదల పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోట్ల రాజేష్, నాపా ప్రసాద్‌లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News