AP Government On Daspalla Hotel: అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్.. ప్రభుత్వం అనుమతులు
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:06 PM
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్‌ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
అమరావతి, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): అమరావతి (Amaravati)లో 4 స్టార్ దసపల్లా హోటల్ (Daspalla Hotel) నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్‌ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది. దసపల్లా హోటల్ నిర్మాణంతో 400 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పదేళ్ల పాటు రాష్ట్ర పన్నులు, స్టాంప్ డ్యూటీ వందశాతం తిరిగి చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీలు విధింపు, ఐదేళ్లకు విద్యుత్ సుంకం తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. టూరిజం పాలసీ 2024 నుంచి 2029 ప్రకారం పలు రాయితీలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజైయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News