AP Rain Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:21 AM
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి.. లోతట్టు ప్రాంతాలన్ని చెరువులని తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా.. పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ(బుధవారం) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(బుధవారం) భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే.. మిగిత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని చెప్పుకొచ్చారు. సముద్ర తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ