Share News

CM Chandrababu: రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:05 PM

గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్‌లో చాలా సమస్యలు చూశానని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: రాజకీయం ముసుగులో  రౌడీయిజం చేస్తే తోక కట్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

గుంటూరు: రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు (AP CM Nara Chandrababu Naidu) హెచ్చరించారు. రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్‌ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(గురువారం) గుంటూరులో యాంటీ నార్కొటిక్స్‌ డేలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గంజాయి సాగుతో దేశాన్ని, ఏపీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ బ్రాండ్‌ను గత పాలకులు నాశనం చేశారని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నానని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.


అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం.. వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని.. లా అండ్ ఆర్డర్‌లో చాలా సమస్యలు చూశానని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని అన్నారు. మారితే మారండి.. మారకపోతే ఏపీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.


గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు.. ప్రతిపక్షాలు కూడా ముందుకువచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని సీఎం చంద్రబాబు కోరారు. చైతన్యం తెచ్చి ఓట్లు కోరాలి తప్ప రాజకీయ లబ్ధి పొందుతామంటే కుదరదని తేల్చిచెప్పారు. ఈగల్ పేరుతో గంజాయిపై రాష్ట్రవ్యాప్తంగా డేగకన్ను వేశామని చెప్పుకొచ్చారు. 26 జిల్లాల్లో నార్కొటిక్‌ సెల్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈగల్‌ సెల్స్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, స్కూళ్లలో ఈగల్‌ క్లబ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు సీఎం చంద్రబాబు.


మద్యం ఆదాయంలో రెండు శాతాన్ని గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్‌, గంజాయిపై పోరాడితే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ సెలబ్రిటీలు ముందుకురావాలని కోరారు. గంజాయి వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చి ఏపీలో అమ్మినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..

For More AP News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 08:16 PM