CM Chandrababu: పీ4.. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ‘గివ్ బ్యాక్’ సిద్ధాంతం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:55 PM
సమాజం వల్ల పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీ4పై శక్తి ఉండే ప్రతి వ్యక్తి అండగా ఉండాలని కోరారు. గివ్ బ్యాక్ అనేది మన సమాజ నినాదం కావాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అమరావతి, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): పీ4 (P4) (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. పేదరికాన్ని సమూలంగా, శాశ్వతంగా నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో పీ4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. పీ4ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మార్గదర్శుల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. పీ4 సంబంధిత మార్గదర్శులతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవాళ పీ4 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీ4 చాలామంది జీవితాల్లో గొప్పమార్పు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్ పాస్ అయిన అమ్మాయికి రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నెలలో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో మార్గదర్శి కావాలని కోరుకుంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు.
అండగా ఉండాలి..
పీ4పై శక్తి ఉండే ప్రతి వ్యక్తి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గివ్ బ్యాక్ అనేది మన సమాజ నినాదం కావాలని దిశానిర్దేశం చేశారు. సమాజం వల్ల పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగి చేయాలని కోరారు. సంపద ప్రజలకు మెరుగైన జీవనం కలిగేలా ఉపయోగపడాలని సూచించారు. ఉగాది రోజు పీ4 కార్యక్రమం గురించి మొదటిసారిగా చెప్పానని.. నేడు ప్రారంభించానని గుర్తుచేశారు. 13,40,600 బంగారు కుటుంబాలను ఇప్పడు మార్గదర్శులు దత్తతు తీసుకొంటున్నారని తెలిపారు. పీ4లో 15 లక్షలు కుటుంబాలను టార్గెట్‌గా పెట్టుకున్నామని... ఇది మానవతా ధృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమమని ఉద్ఘాటించారు. పీ4లో చేరాలని ఎవరినీ ఎలాంటి బలవంతం చేయడం లేదని... మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీకు గొప్ప సంతృప్తి కలుగుతుందని చెప్పుకొచ్చారు. 250 కుటుంబాలను తానే దత్తతు తీసుకొని వారిని స్వయంగా మానిటర్ చేస్తున్నానని వివరించారు. ఇకపై ప్రభుత్వ పాలసీలు పేదలకు అనుకూలంగానే ఉంటాయని.. అదే సమయంలో సంపద సృష్టించాలని అన్నారు. ఏమాత్రం మనస్సున్నా పీ4 ఆచరణ సాధ్యమేనని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
64 లక్షల మందికి పెన్షన్లు..
‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ అన్నారు. అప్పట్లో వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వెలుగు కార్యక్రమం నడిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాల్గోస్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మూడో స్థానానికి రానుంది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతీ ఏడాది రైతులకు రూ.20 వేలచొప్పున పెట్టుబడి సహాయం చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. గ్యాస్ ధరలు పెరిగాయని మళ్లీ కొందరు కట్టెల పొయ్యి వాడారు. అందుకే మహిళల కోసం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఒకప్పుడు ఆడబిడ్డలను చదివించే వారు కాదు. కాలేజీలు, ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించాం. ఫలితంగా చదువుకునే ఆడవారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు భర్తల కంటే భార్యలే ఎక్కువగా సంపాదిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కరెంట్ చార్జీలను తగ్గించాం
అగ్రిటెక్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం.
లాజిస్టిక్స్‌పైనా పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాం.
ఇప్పుడు కరెంట్ చార్జీలను తగ్గించాం.
సొంత ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి సోలార్ వల్ల చేయగలుగుతున్నాం.
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం.
704 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చాం.
టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకూ ప్రయోజనం ఉంటుంది.
ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలం ఇవ్వడం , గ్యాస్ , సోలార్ , డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం వంటివి చేస్తున్నాం.
ఒక ప్యామిలీ ఒక ఎంట్రపెన్యూర్ అనే విధానం తీసుకున్నాం.
2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం.
2020 విజన్ డాక్యుమెంట్ చెప్పాం... ఇప్పుడు ఊహంచిన దానికంటే ఎక్కవ హైదరాబాద్‌లో చూస్తున్నాం.
దేశంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం మరోసారి వైకుంఠపాళి ఆడకుండా ప్రజలు నమ్మకం ఉంచి కొనసాగిస్తే 2047 నాటికి నెంబర్ వన్ అవుతాం.
అట్టడుగున సమాజంలో ఉన్నవారు చదువు, వైద్యం కూడా పొందలేకపోతున్నారు.
ఒక వ్యక్తి ఒకేసారి 121 కేజీల బంగారం అంటే రూ.140 కోట్లు పీ4కు ఇచ్చారు.
అందరం ఓ రోజు చనిపోతాం ఎవ్వరూ శాశ్వతం కాదు.
కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు ...కొందరు దుర్వినియోగం చేసుకుంటారు.
చనిపోయాక కూడా పదిమంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి...అందుకే మానవత్వంతో ముందుకు పోవాలి.
సమాజం ఇచ్చిన అవకాశాన్ని నేనే సద్వినియోగం చేస్తున్నా... మీరు కూడా మీ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సంపద సృష్టించాలి..
దానధర్మాలు చేయడం మనకు కొత్తకాదు.. మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది.
శక్తిమేరకు దానధర్మాలు చేస్తునే ఉంటారు... తూర్పు గోదావరిలో డొక్కా సీతమ్మ అన్నపూర్ణగా ఆకలి తీర్చారు.
డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధిగా ఎవరు వచ్చినా అన్నం పెట్టిన దాతగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.
హెచ్‌సీఎల్ ఫౌండేషన్, కీర్తి , కిషోర్ కుమార్ , మెగా కృష్ణారెడ్డితో పాటు, నూజీవీడు సీడ్స్ నుంచి కొందరూ ఎన్నారైలు తమ ఆలోచనలు చెప్పారు.
ఐర్లాండ్ నుంచి వచ్చిన కార్తికేయను అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన నుంచి చదివిస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకుని వచ్చి భాగస్వామి అవుతామంటున్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రెండు శాతం వరకూ తీసుకువచ్చారు.
దేశంలో సంపద సృష్టించడం చాలా కష్టంగా ఉండేది.
ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం సులభమైంది.
మంచి రోడ్లు, విమానాశ్రయాలు, టెలికమ్యూనికేషన్‌లు బాగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆడబిడ్డలకు ఆర్ధిక స్వాతంత్య్రం...
త్వరలోనే అమెరికా, చైనా తర్వాత భారత్ త్వరలోనే మూడో స్థానానికి చేరుతుంది.
రూ. 33వేలకోట్లు పెన్షన్‌ల రూపంలో పేదలకు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. పేదల సేవ పేరుతో ఇంటికే వచ్చి అధికారులు వీటిని అందిస్తున్నారు.
ఆగస్టు 1వ తేదీన పెన్షన్‌లు, ఆగస్టు 4వ తేదీన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కింద పిల్లలకు ఫీజులు ఇచ్చాం ఏడుమంది పిల్లలు ఉన్నా వారికి తల్లికి వందనం ఇచ్చాం.
ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఆగస్టు 15వ తేదీన అమలు చేశాం.. వారికి ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చాం.
ఆడపిల్లలు స్కూలుకు, వ్యాపారాలకోసం వెళ్లడం, దేవాలయాలకు వెళ్లడం, తదితర కార్యక్రమాలకు ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది.
ఎన్నికల్లో ఓట్ల కోసం స్త్రీ శక్తి కాదు... వారు బయటకు రావడం వల్ల ఏపీలో ఆర్థిక విప్లవానికి వీరు మార్గదర్శకులు అవుతారు.
నా తల్లికి పొగచూరిన పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి గురయ్యారు.
ధరలు పెరుగుతున్నాయిని మహిళలు తిరిగి కట్టెల పొయ్యికి వెళ్లకూడదనే మూడు సిలిండర్‌లు దీపం- 2 పథకం కింద ఇచ్చాం.
నేను ఇచ్చే పథకాలు వినియోగించగలిగితే మీ ఆదాయమే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది.
ఐటీ రంగంలో భార్యభర్తలు ఉంటే వారిలో 80 శాతం మందికి భార్యలకే ఎక్కువ జీతం ఉంటుందని తేలింది.
ఏపీలో జనాభా తగ్గిపోతుంది... గతంలో జనాభా పెరుగుతుందని 1995 తర్వాత చెప్పాం.. ఇప్పడు రివర్స్ ప్రమోట్ చేస్తున్నాం.
ఖర్చులు పెరగడంతో చాలామంది పిల్లలను కనడం కూడా మానేస్తున్నారు.
యూరప్ , చైనా, జపాన్లు మన మీద ఆధారపడుతున్నారు... వారికి మిషన్లు ఉన్నాయి. వాటి ఆపరేషన్‌కు మనుషులు మనవద్ద నుంచి వెళ్తున్నారు.. అందుకే పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ద పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
Read Latest AP News and National News