CM Chandrababu On Abu Dhabi: ఏపీలో పరిశ్రమలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:17 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. అబుదాబీ చాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ-42 సీఈవో మాన్సూర్ అల్ మాన్సూరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15వ తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని పారిశ్రామిక ప్రతినిధులు చెప్పారు. అలాగే.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపించారు ఏడీఎన్‌ఓసీ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు సీఎం.
దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు ముఖ్యమంత్రి. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అనంతరం అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో నెట్‌వర్క్ లంచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొన్నారు. నెట్‌వర్క్ లంచ్‌లో జీ-42 సీఈవోతో, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యూఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్
దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్డుషోలో ఏపీపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అద్బుతంగా రెస్పాండ్ అయ్యారు యూఏఈ పారిశ్రామికవేత్తలు. సీఎం ప్రజెంటేషన్‌కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు. ఏపీలో ఉన్న అవకాశాలను వివరిస్తూ... పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు... గనులు మొదులుకుని స్పేస్ టెక్నాలజీ వరకు... చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు ముఖ్యమంత్రి. పెట్టుబడుల గురించే కాకండా... ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనాంశాల గురించి వివరించారు సీఎం. రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News