Share News

Andhra Pradesh Govt: గుడ్ న్యూస్.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్

ABN , Publish Date - Aug 21 , 2025 | 07:02 PM

ఏపీలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీఎం టెర్మినల్స్‌తో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

Andhra Pradesh Govt: గుడ్ న్యూస్.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్
Andhra Pradesh Govt

అమరావతి, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో (APM Terminals) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీఎం టెర్మినల్స్‌తో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టుల నిర్వహణను ఏపీఎం టెర్మినల్స్ సంస్థ చేపట్టనుంది.


ఓడరేవుల్లో ఆధునిక టెర్మినల్స్ ఏర్పాటు, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏపీఎం టెర్మినల్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.9 వేల కోట్లతో ఏపీలోని పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్‌తో సహా ఆధునిక టెర్మినల్స్‌ను ఏపీఎం టెర్మినల్స్ ఏర్పాటు చేయనుంది. ఏపీఎం టెర్మినల్స్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 07:07 PM