AP Govt On Student Protection: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థుల రక్షణకు కమిటీ నియామకం
ABN , Publish Date - Oct 14 , 2025 | 09:17 PM
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది.
అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల (Students) ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటుతో సహా తదుపరి చర్యలకు సిద్దమైంది కూటమి ప్రభుత్వం. 13 మందితో ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీ ప్రభుత్వం.
కమిటీ ఛైర్ పర్సన్‌గా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని నియమించింది. టెక్నికల్, ఇంటర్మీడియట్, స్కూల్ , మెడికల్ ఎడ్యుకేషన్ల డైరెక్టర్లను సభ్యులుగా ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా మానసిక వైద్యులు,స్త్రీ శిశు సంక్షేమ, న్యాయ విభాగాల ప్రతినిధులు ఉన్నారు. అన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నమోదు కోసం సమగ్ర నియమాలు రూపొందించాలని కమిటీకి ఆదేశించింది కూటమి ప్రభుత్వం.
అలాగే, విద్యార్థి రక్షణ నిబంధనలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల రూపకల్పన చర్యలు సిఫార్సు చేయాలని సర్కార్ దిశానిర్దేశం చేసింది. సుప్రీంకోర్టు నిర్ధేశించిన మానసిక ఆరోగ్య రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ సిఫార్సులను రెండు వారాల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఈ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News