Share News

AP NEWS: సీరియల్ కిల్లర్‌‌ను చూసి వణికిపోయిన ప్రజలు

ABN , Publish Date - May 03 , 2025 | 09:48 AM

Kakinada Serial Killer: ప్రజలను ఓ సీరియల్ కిల్లర్ తీవ్ర భయాందోళనకు గురి చేశాడు. ఈ నిందితుడు గతంలో చాలా ఘోరాలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఈ క్రిమినల్ వార్తల్లో నిలిచాడు. కాకినాడలోని ఓ ఆస్పత్రికి వైద్యపరీక్షలకు నిందితుడిని తీసుకురావడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది వణికిపోయారు.

AP NEWS: సీరియల్ కిల్లర్‌‌ను చూసి వణికిపోయిన ప్రజలు
Kakinada Serial Killer

కాకినాడ: సమాజంలో నేరాలు చేసే క్రిమినల్స్ అంటే ప్రజలకు ఎంతో భయం. వారు కనపడినా, వారి పేరు వినిపించినా ప్రజలు ఎంతో భయపడుతారు. ముఖ్యంగా హత్యలు, అత్యాచారాలు చేసే నిందితులను చూస్తే ప్రజలు బెంబేలెత్తిపోతారు. తాజాగా అలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలో ఈరోజు(శనివారం) ఓ సీరియల్ కిల్లర్‌ను చూసి ప్రజలు గజగజ వణికిపోయారు. పోలీసులు ఆ క్రిమినల్‌ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. క్రిమినల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన ప్రజలు మాత్రం భయపడిపోయారు.


వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన 45 ఏళ్ల నిత్యానందన్‌పై 2020లో 10 అత్యాచారాలు, 7 హత్య కేసులు నమోదయ్యాయి. పోలీసులు సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేసి పాండిచ్చేరి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన అనంతరం కిల్లర్‌‌ను దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. యానాం జైల్లో ఉన్న కిల్లర్ కంటి సంబంధిత అనారోగ్యానికి గురవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో నిత్యానందన్‌‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రికి కిల్లర్‌ను ఎస్కార్టు పోలీసులు తీసుకురావడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. అతని చరిత్ర తెలుసుకుని ప్రజలు షాకుకు గురయ్యారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Vijayawada: అంతా పీఎస్సార్‌ కనుసన్నల్లోనే

Simhachalam: నోటి మాటతో గోడ కట్టేశారు

Simhachalam tragedy: గత ఐదేళ్లలో ఎన్నో ప్రమాదాలు.. అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా

Andhra Pradesh weather: నేడు అక్కడక్కడా వర్షాలు ఎండలు

For More AP News and Telugu News

Updated Date - May 03 , 2025 | 10:08 AM