Pawan Kalyan On Kakinada SEZ Lands: పవన్ కల్యాణ్ చొరవ.. అపరిష్కృత సమస్య పరిష్కారం
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:28 PM
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.
పవన్ కల్యాణ్ చొరవ తీసుకొని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరుగనుంది. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయంపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపునిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News