Share News

Newborn Baby Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

ABN , Publish Date - Jul 06 , 2025 | 10:44 AM

వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. డాక్లర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.

Newborn Baby Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి
Newborn Baby Tragedy

అంబేద్కర్ కోనసీమ (ముమ్మిడివరం): వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి (Newborn Baby Tragedy) చెందింది. ఈ ఘటన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. డాక్లర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఐ.పోలవరం మండలం పెదమడికి చెందిన ధరణి టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టినప్పటి నుంచి కదలికలు లేకపోవడంతో అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్లు సూచించారు.


బాబు బంధువులు బైక్‌పై అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబుని పరిశీలించారు. అప్పటికే బాబు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ తిరిగి టి.కొత్తపల్లి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి ఆస్పత్రి సిబ్బందితో బాధితులు మాట్లాడారు. వైద్యులు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.


టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాబు మృతిచెందినట్లు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల ఆందోళనతో టి. కొత్తపల్లి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న ఐ.పోలవరం ఎస్ఐ రవీంద్ర బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బాధితులతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుని విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.


ఇవి కూడా చదవండి:

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌

టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

For More AP News and Telugu News

Updated Date - Jul 06 , 2025 | 11:00 AM