Road Accident in Eluru: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:55 PM
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర అదుపుతప్పి ప్రైవేటు బస్సు ఇవాళ(సోమవారం) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 16మంది ప్రయాణికులు ఉన్నారు.
ఏలూరు జిల్లా, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా (Eluru Dist)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర అదుపుతప్పి ప్రైవేటు బస్సు ఇవాళ(సోమవారం) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 16మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే ఏలూరు జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏలూరు జిల్లా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్
వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
Read Latest AP News And Telugu News