Chittoor Treasure Hunt: వైసీపీ నేతల గుప్తనిధుల వేట.. పోలీసుల మెరుపుదాడి..
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:11 PM
అరెస్ట్ చేసిన వారిలో పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ జిల్లా సెక్రటరీ యర్రబల్లి శ్రీను, చెన్నైకి చెందిన శరవణ ఉన్నారు. అలాగే.. పుంగనూరు మండలం బండపల్లెకు చెందిన శ్రీనివాస్, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, తవనంపల్లె మండలం పట్నంకు చెందిన రమేష్, జేసిజి డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
చిత్తూరు: పెద్దపంజాణి మండలం వీరప్పల్లి కొండపై గుప్తనిధుల తవ్వకాలపై పలమనేరు పోలీసులు మెరుపుదాడి చేశారు. వైసీపీ జిల్లా కార్యదర్శి అధ్వర్యంలో స్వామీలతో కలిసి గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలు చేపట్టిన వ్యక్తులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ జిల్లా సెక్రటరీ యర్రబల్లి శ్రీను, చెన్నైకి చెందిన శరవణ ఉన్నారు. అలాగే.. పుంగనూరు మండలం బండపల్లెకు చెందిన శ్రీనివాస్, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, తవనంపల్లె మండలం పట్నంకు చెందిన రమేష్, జేసిజి డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పుంగనూరు మండలంకు చెందిన ఇద్దరు స్వామిజీలు వీరప్పల్లి కొండపై ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. ఆ ఇద్దరు స్వామిజీలు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి జేసీబీ, ఒక కారు, నాలుగు బైకులు, పూజ సామాగ్రి, గడ్డపారలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు