Manchu Mohan Babu: మంచు మోహన్ బాబుకు.. బిగ్ షాక్
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:32 PM
తిరుపతిలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్.
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి (Tirupati)లోని నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్. విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది.
అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.15 లక్షలు జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్.
ఈ వార్తలు కూడా చదవండి..
విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు
Read Latest AP News And Telugu News