Share News

ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:09 PM

కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.

ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే
ABN Andhrajyothy Article

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం (ABN Andhrajyothy Article) ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ (MLA Kandikunta Venkata Prasad) స్పందించారు. గురుకుల పాఠశాలను ఇవాళ(శనివారం) ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఎస్టీ కమిషన్ మెంబర్ వెంకటప్ప పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మాటిచ్చారు. కుళ్లిన కూరగాయలతో.. పురుగులు పడిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైందని.. ఈ కథనాన్ని చూసి వెంటనే స్పందించామని చెప్పుకొచ్చారు.


ఈ సమస్యను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రిన్సిపాల్‌పై శాఖపరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అంతటితో తమ బాధ్యత అయిపోదని.. 29వ తేదీ లోపల పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మాటిచ్చారు. మళ్లీ రెండు రోజుల్లో అన్ని పాఠశాలలను సందర్శిస్తామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 05:20 PM