Share News

CM Chandrababu: ఆ అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్.. అసలు కారణమిదే...

ABN , Publish Date - Jan 26 , 2025 | 07:59 PM

CM Chandrababu Naidu: సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

CM Chandrababu: ఆ అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్..  అసలు కారణమిదే...
CM Chandrababu Naidu

అమరావతి: సత్యసాయి జిల్లా సికేపల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వార్డెన్, సంబంధిత ఉద్యోగులు వండకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం సమకూర్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదు: మంత్రి సవిత

savitha-minister.jpg

సత్యసాయి జిల్లా సీకేపల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్‌డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి సవిత ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సవిత కలెక్టర్‌తోనూ బీసీ సంక్షేమ శాఖాధికారులతోనూ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. సీకేపల్లి బాలుర హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని మంత్రి సవిత ఆరా తీశారు.


హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదని మంత్రి ఫైర్ అయ్యారు. తక్షణమే విద్యార్థులకు భోజనం సదుపాయం కల్పించాలని, రాత్రికి కూడా ఎలాంటి లోటూ రానివ్వొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులను ఆకలితో బాధపడేలా చేసిన సీకేపల్లి బీసీ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో నారాయణ స్వామిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ను మంత్రి సవిత ఆదేశించారు. హెచ్‌డబ్ల్యూవోను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ టీఎస్ చేతన్ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి వివరాలు అందివ్వాలని మంత్రి సవిత ఆదేశించారు. అధికారులపై నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారని, వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 26 , 2025 | 08:05 PM