Share News

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

ABN , Publish Date - May 26 , 2024 | 09:00 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. రేపు జరిగే పట్టభద్రుల ఎన్నికలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలను, ఇన్‌చార్జిగా నియమించారని చెప్పారు.

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
Raghunandan Rao

మెదక్ జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. రేపు జరిగే పట్టభద్రుల ఎన్నికలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలను, ఇన్‌చార్జిగా నియమించారని చెప్పారు. ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ తన అధికార బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్ బ్రాంచి నుంచి నిన్న 30 కోట్ల రూపాయలను పార్టీ ఇన్‌చార్జిలకు ట్రాన్స్‌ఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.


తూప్రాన్‌లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ... బంజారాహిల్స్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా 30 కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 30 కోట్ల రూపాయలను తన అధికారిక ఖాతా నుంచి ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


డబ్బును ఎవరెవరికి బదిలీ చేశారో సీఈఓ వికాస్‌రాజ్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మనీ ట్రాన్స్‌ఫర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయంపై యాక్షన్ తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి అకౌంట్లు సీజ్ చేసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని సీఈఓ‌ వికాస్‌రాజ్‌ను కోరారు. డబ్బులు పంచి ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


రేపు జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు కొనాలన్నా బీఆర్ఎస్ ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై విచారణ చేయకపోతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:48 PM