Share News

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - May 26 , 2024 | 08:45 PM

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేశానని చెప్పారు.

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Tummala Nageswara Rao

ఖమ్మం: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేశానని చెప్పారు. పామాయిల్ సాగుతో రైతాంగం రాజుగా మార్చాలనేదే తన తపన అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పామాయిల్ తొలి మొక్క నాటారని గుర్తుచేసుకున్నారు. ఆదివారం రఘునాథ పాలెం మండలం బాలపేటలో పామాయిల్ రైతుల సదస్సులో మంత్రి తుమ్మల, రైతు సంఘం నేతలు, పామాయిల్ రైతులు పాల్గొన్నారు.


గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ...తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు పామాయిల్ సాగుతోనేనని చెప్పారు. పామాయిల్ రైతులకు డ్రిఫ్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణకే పామాయిల్ హబ్‌గా మారనుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల పామాయిల్ గెలల ధరలు తగ్గాయన్నారు. మన దేశంలో పామాయిల్ దిగుమతుల విలువ ప్రతి ఏడాది లక్ష కోట్ల వరకు ఉంటాయన్నారు. పామాయిల్ సాగులో అంతర పంటగా కోకో, వక్క , జాజికాయ సాగుతో రైతాంగానికి అదనపు లాభాలు వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:50 PM