Share News

Bhatti Vikramarka: మోదీ.. అబద్ధాలకోరు!

ABN , Publish Date - May 26 , 2024 | 03:44 AM

ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Bhatti Vikramarka: మోదీ.. అబద్ధాలకోరు!

  • ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు: భట్టి

  • పంజాబ్‌లో డిప్యూటీ సీఎం ప్రచారం..

  • మాలావత్‌ పూర్ణకు మంత్రి సీతక్క సన్మానం

  • కేటీఆర్‌కు ఆ అర్హతే లేదు: బల్మూరి వెంకట్‌

  • ఉప్పల్‌ స్టేడియం వద్ద ప్రతిష్ఠాపనకు

  • రాజీవ్‌ విగ్రహం చేయించిన వీహెచ్‌

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. రైతు ఆ దాయం రెట్టింపు చేస్తానని చెప్పి పగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు. కానీ వాటిని అమలు చేయలేదు. అందుకే ఈసారి దేశ ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు.


ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. మత రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని విమర్శించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం అంతమవుతుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు. అతి పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణను మంత్రి సీతక్క సన్మానించారు. పూర్ణ ఎవరెస్టు అధిరోహించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. పూర్ణ కుటుంబ సభ్యులూ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.


కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డిలకు పదవులెక్కడివి?: బీర్ల

సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డిలకు పదవులెక్కడివని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసింది కేసీఆరేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు సోనియాను ఎలా ఆహ్వానిస్తారంటూ జగదీశ్‌రెడ్డి.. మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా ను విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొడతారని ఓ ప్రకటనలో హెచ్చరించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు.


గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా విద్యార్థులు, నిరుద్యోగుల గురించి పట్టించుకున్నారా? అని నిలదీశారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద ఏర్పాటు చేసేందుకు 13 అడుగుల రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో తయారు చేయించానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వెల్లడించారు. ఆగస్టు 20 రాజీవ్‌ జయంతి రోజున ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగాలన్నది తన కోరిక అని చెప్పారు.

Updated Date - May 26 , 2024 | 03:44 AM