Share News

TG Politics: ఇండియా కూటమికి 272కు పైగా స్థానాలు.. మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 08:33 PM

ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

TG Politics: ఇండియా కూటమికి 272కు పైగా స్థానాలు.. మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. తన అనుభవంతో చెబుతున్న ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

దేశ చరిత్రలో 70 రోజుల్లో 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. తప్పకుండా అన్ని గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని.. అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 100 హామీలు ఇచ్చి పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తాము ఐదు హామీలను ఇచ్చి 70 రోజుల్లో అమలు చేశామని తెలిపారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు, రేషన్ సరఫరాల్లో పూర్తిగా సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు.


Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

రైతులకు ధాన్యం విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తుందటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న ఆరోపణలేనని అన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ఎప్పుడు సమర్థవంతంగా జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యాన్ని సమర్థవంతంగా కొంటున్నామని.. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని అన్నారు.


Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను 2022-23 ఏప్రిల్ 9వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీనే ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. గత ఏడాది 7031 ఉంటే ఇప్పుడు 7149 పెంచామని తెలిపారు. ఇప్పటికే 6919 కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సమయానికి గత ఏడాది 335 ధాన్యం కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రతి రైతుకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ప్రభుత్వానికి ధాన్యం వేలంలో అదనపు ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో లాభనష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ నిల్వ ఉన్న యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. పౌర సరఫరాల శాఖను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపించిందని మండిపడ్డారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రిసైక్లింగ్ మాఫియాగా తయారైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు.

Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 08:36 PM