Share News

Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:27 PM

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లాలోని కోస్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలకు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

నారాయణపేట జిల్లా, (కోస్గి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లాలోని కోస్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలకు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు.

10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉందని.. ప్రజలకు ఏం చేసిందని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కాలేజ్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వరికి రూ. 500 బోనస్ ఏమైందన్నారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఎక్కడని నిలదీశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని ధ్వజమెత్తారు.


TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అయిన పథకాలు వస్తున్నాయి అనుకున్నా కానీ ఇక్కడ కూడా రావట్లేదని అన్నారు. అందర్నీ మోసం చేసిన కాంగ్రె‌స్‌ని పార్లమెంట్ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో ఫార్మా సిటీ కోసం హకీమ్‌పేట, పోలేపల్లి, రైతులకు చెందిన భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు తనకు లేఖ ఇచ్చారని తెలిపారు. రైతులు ఎవ్వరు కూడా బాధపడవద్దని... ఆ బాధిత రైతుల పక్షాన అవసరం అయితే అసెంబ్లీలో కొట్లాడుతానని ధైర్యం కల్పించారు. మహబూబ్ నగర్‌ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని హరీశ్‌రావు కోరారు.


ఇవి కూడా చదవండి

Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 05:41 PM