Share News

Minister Ponguleti: మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీల్లో ఎవరూ ఉండరు

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:42 PM

తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Minister Ponguleti: మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీల్లో ఎవరూ ఉండరు

ఖమ్మం: తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడదని.. అధికారం ఎక్కడ కోల్పోతామని కేసీఆర్ (KCR) భయపడి ఇష్టరితీగా ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. తమకు అలాంటి భయం లేదని అన్నారు. బీఆర్ఎస్ మీద తాము కక్ష పూరితంగా కేసులు పెట్టలేదన్నారు. ఆ కేసులన్నీ గులాబీ నేతలు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులేనని అన్నారు.

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ఆ విషయంపై కొన్ని మీడియా సంస్థలది దుష్ప్రచారం

జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోయిన ఫొటోలు, వీడియోలను చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్‌లోనని.. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. కానీ కేసీఆర్ చేయాల్సిన పనులు చేయకుండా బాధ్యత విస్మరించి తమపై రాళ్లేయడం తగదన్నారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఒకటి, రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్పని చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని... తమకు ఎంఐఎం మద్దతు తెలుపుతుందని అన్నారు.

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

తాము చెప్పిందే చేస్తున్నామని.. గత పాలకుల అవినీతి మీద పోరాడుతున్నామన్నారు. కేసీఆర్ వల్ల డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నామని చెప్పారు. 5 ఎకరాలకు రైతు బంధు ఇస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పామని.. చెప్పినట్లే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని అన్నారు. జీతాల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని చెప్పారు. జీతాలు త్వరగా వేసేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని అన్నారు. తాను బీజేపీతో టచ్‌లో ఉన్నానని అనడం కరెక్ట్ కాదని... కావాలని తనను ట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

BRS: ఆ ఐదు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జనభర్జన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 04:49 PM