Share News

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:02 PM

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ స్థానంపై టెన్షన్ నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

ఖమ్మం: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ స్థానంపై టెన్షన్ నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు యుగెందర్‌కు ఖమ్మం టికెట్ ఇప్పించేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఖమ్మం లోక్ సభ స్థానం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇవ్వాలో ఏఐసీసీ తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఏఐసీసీ ఇంచార్జ్ మున్షీకి అప్పగించింది. సాయంత్రం మున్షీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 02:02 PM