Share News

BRS: ఆ ఐదు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జనభర్జన

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:12 PM

Telangana: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీ నేతలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గానూ పలువురు అభ్యర్థులను ఇప్పటికే పార్టీలు ప్రకటించేశాయి. అయితే ఇటీవల తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్.. ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు కూడా.

BRS: ఆ ఐదు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జనభర్జన

హైదరాబాద్, మార్చి 21: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీ నేతలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గానూ పలువురు అభ్యర్థులను ఇప్పటికే పార్టీలు ప్రకటించేశాయి. అయితే ఇటీవల తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ (BRS) పార్టీ మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ (BRS Chief KCR).. ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు కూడా. అయితే ఐదు స్థానాలపై మాత్రం పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ ఐదు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Phone Tapping Case: ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు

పెండింగ్ స్థానాల అభ్యర్థుల కోసం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నేతలు పార్టీ వీడుతుండటం కూడా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారిన పరిస్థితి. నల్గొండ నుంచి బరిలో నిలపడానికి మొదట గుత్తా అమిత్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ పరిశీలించింది. అయితే అమిత్ రెడ్డి పోటీకి నో చెప్పడంతో సైదిరెడ్డికి గులాబీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సైదిరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లడంతో అభ్యర్థి కోసం గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ కోసం కంచర్ల కృష్ణారెడ్డి, కడారు అంజయ్య యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే బీఆర్‌ఎస్ అధినేత మాత్రం కంచర్ల కృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Viral: దేవుడా.. ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మహిళ ఎలాంటి పని చేసిందో చూస్తే..



సేమ్ సీన్ రిపీట్..

ఇక భువనగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. భువనగిరి కోసం మొదట మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు ఫైనల్ చేసింది. కానీ ఫైళ్ళ కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో మరో అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం భువనగిరి రేసులో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషణ సాగిస్తోంది. సికింద్రాబాద్ కోసం పద్మారావు, దాసోజు శ్రావణ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావును పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్ ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

Odisha: బీజేపీ-బీజేడీ పొత్తు పొడుస్తుందా.. 15 ఏళ్ల చరిత్ర రిపీట్ కానుందా


వీడని పీటముడి..

అటు మెదక్ అభ్యర్థిపైనా పీటముడి ఇంకా వీడలేదు. మొదట మెదక్ కోసం ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలించారు. వెంకట్రామిరెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఒంటేరు ప్రతాపరెడ్డి పేరును అధినేత పరిశీలిస్తున్నారు. అలాగే హైదరాబాదులో పోటీ నామ మాత్రమే కావడంతో మిగిలిన నాలుగు స్థానాలపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లోనే పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Deepfake: ప్రధానిపై డీప్ ఫేక్ వీడియోలు.. రూ.90 లక్షల దావా వేసిన పీఎం

Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 03:17 PM