Share News

Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం

ABN , Publish Date - Mar 21 , 2024 | 01:49 PM

99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఆయన ఎక్స్ వేదికగా ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ఎక్స్‌లో ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం

అమరావతి: 99 శాతం హామీల అమలంటున్న జగన్ (CM Jagan) మాటలు బూటకమని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. నేడు ఆయన ఎక్స్ (X) వేదికగా ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ఎక్స్‌లో ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలి అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?

5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని చంద్రబాబు పేర్కొన్నారు. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమన్నారు. విశ్వసనీయతపై ఆయన కబుర్లు అతిపెద్ద నాటకమన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న జగన్.. ముందుగా గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 01:49 PM