Share News

Kishan Reddy: కాంగ్రెస్ నేతలను సమస్యలపై అడుగడుగునా రైతులు ప్రశ్నించాలి

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:40 PM

కాంగ్రెస్ (Congress) నేతలను రైతులు సమస్యలపై అడుగడుగునా ప్రశ్నించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమని అడిగితే ఏం చేశారని ప్రశ్నించాలని అన్నారు.

Kishan Reddy: కాంగ్రెస్ నేతలను సమస్యలపై అడుగడుగునా రైతులు ప్రశ్నించాలి

హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) నేతలను రైతులు సమస్యలపై అడుగడుగునా ప్రశ్నించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమని అడిగితే ఏం చేశారని ప్రశ్నించాలని అన్నారు. ఎరువులు, విత్తనాలు అందకపోయినా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.


Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

కాంగ్రెస్ చేసిన మోసాలకు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ కష్టం వచ్చిన తమకు చెప్పాలన్నారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీసి అడగండి కానీ.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు.


Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

కేంద్ర నిధుల నుంచి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని కోరారు. అర్హులు ఎవరున్నారో స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో వివరాలు ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే తమకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు అన్నా ఈ 9904119119 నంబర్‌కి కాల్ చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి

TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు.

Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 05:43 PM