Share News

CM Revanth: ఇల్లాలి ముఖంలో సంతోషం చూసేందుకే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’...

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:23 PM

Telangana: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం ఎంతో సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నాడు ఇందిరమ్మ పాలనలో ఉంటే నేడు ప్రజా పాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అని అన్నారు.

CM Revanth: ఇల్లాలి ముఖంలో సంతోషం చూసేందుకే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’...

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం ఎంతో సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సోమవారం భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నాడు ఇందిరమ్మ పాలనలో ఉంటే నేడు ప్రజా పాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అని అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉండేలా పేద వాళ్ళు ఆత్మ గౌరవంతో బతికేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇంటి పట్టా ఆడబిడ్డ పేరు మీద ఇస్తామన్నారు. డబ్బా ఇళ్ళు వద్దు పండగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు అంటూ పేదల కలల మీద కేసీఆర్ రాజకీయ వ్యాపారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ మోసానికి కాలం చెల్లిందని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టారన్నారు.

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరదీసిన జగన్ ప్రభుత్వం


ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్‌ల మధ్య గతంలో వైరుధ్యాలున్నా నేడు కాంగ్రెస్ సీపీఐ కలసి పనిచేస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదన్నారు. రామాలయం అభివృద్ధిపై మంత్రి తుమ్మల చెప్పారని.. రిటైనింగ్ వాల్ కోసం రూ.500 కోట్లు ఈరోజే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 92 రోజుల్లోనే గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 24 కోట్ల మంది ఆడ బిడ్డలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో పేదల ఆరోగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆడబిడ్డల కన్నీళ్ళు తుడవడానికి సోనియమ్మ ఆలోచనలతో రూ.500 కే గ్యాస్ సిలిండర్‌ను అందజేస్తున్నట్లు చెప్పారు. పేదల ఇళ్లకు కరెంట్ బిల్లులు భారం లేకుండా గృహ జ్యోతి పథకం తీసుకొచ్చామన్నారు. 4 లక్షల 50 వేల ఇళ్లు నిర్మాణం కోసం నేడు ఇందిరమ్మ పథకం ప్రారంభించామన్నారు. వేలాది మంది ఆడ బిడ్డల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు. మీడియా రంగంలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తిస్తున్నారు.


కేసీఆర్‌కు సవాల్..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ‘‘కేసీఆర్ ఏ ఊరులో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చారో అక్కడ ఓట్లు అడగండి. ఇందిరమ్మ ఇళ్లున్న గ్రామంలో మేం ఇట్లు అడుగుతాం’’ అంటూ ఛాలెంజ్ చేశారు.

కేసీఆర్, మోదీనీ బండకేసి ఉతుకుతాం...

కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లకు కూడా ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ‘‘తెలంగాణలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారో బీజేపీ నాయకులు చెప్పాలి. ఢిల్లీలో రైతులను తుపాకీ తూటాలకు బలి తీసుకుంది మోదీ సర్కార్. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ బీజేపీ నేతలని నిలదీయాలి. కేసీఆర్, మోదీనీ బహిరంగ సభలో బండకేసి ఉతుకుతాం’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..

Congress: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్


Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 04:36 PM