Share News

Telangana: గులాబీ పార్టీకి ముఖ్య నేతల గుడ్ బై.. హస్తం ధాటికి బీఆర్ఎస్ సతమతం..

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:04 PM

తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిని అందించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరస చిక్కుల్లో ఇరుక్కుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.

Telangana: గులాబీ పార్టీకి ముఖ్య నేతల గుడ్ బై.. హస్తం ధాటికి బీఆర్ఎస్ సతమతం..

తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిని అందించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరస చిక్కుల్లో ఇరుక్కుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ నుంచి ముఖ్య నేతల వలసలు ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్, బలం పుంజుకుంటున్న బీజేపీలోకి నేతల ఫిరాయింపులు జోరందుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పాలనుకున్న బీఆర్ఎస్ ( BRS ) అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ఉన్న నేతలనూ కాపాడుకోలేకపోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ సిద్ధమయ్యాయి. కాసేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు కడియం శ్రీహరికి ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు వరంగల్ ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


వీరితో పాటు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సైతం గులాబీ పార్టీకి వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా హస్తం పార్టీకి టచ్ లో ఉన్నారట. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. వర్ధన్నపేట చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ల తో పాటు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక నేత మాజీ మేయర్ ప్రకాష్ సైతం బిఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ బాట పట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 04:04 PM