Share News

Womens Day: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:24 AM

Telangana: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Womens Day: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) మహిళా దినోత్సవ వేడుకలు (Womens day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy), సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxmareddy) కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు (BRS Women Corporators) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ లేనిదే గమ్యం, గమనం లేదన్నారు. ‘‘మనకంటే ముందు తరంవారు మన అక్క, చెల్లెలు మన కోసం పోరాటం చేశారు’’ అని తెలిపారు. చాకలి ఐలమ్మ (Chakali Ilamma) భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేశారని... రాణి రుద్రమ (Rani Rudrama) పోరాటం మనకు స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం పోరాటం కొనసాగించాలని కవిత వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

United Airlines: వామ్మో.. టేకాఫ్ అయిన తర్వాత ఊడిన విమాన టైర్


AP Elections: మళ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ.. అందరూ బిగ్‌షాట్‌లే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 12:56 PM