Share News

TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:17 PM

Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.

TS Highcourt:  ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, మార్చి 22: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Khairatabad MLA Danam Nagender) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత విజయారెడ్డి (Congress leader Vijayarddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వెల్లడించారు. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలకు విన్న కోర్టు వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దానంకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని


కాగా.. దానం నాగేందర్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే దానం.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే దానం కాంగ్రెస్‌ గూటికి చేరడంపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి వినతి కూడా చేశారు.

ఇవి కూడా చదవండి...

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..

Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో ఉన్న రెండో వేటగాడిని కనిపెట్టండి..!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 05:45 PM