Share News

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:59 PM

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్‌ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్‌ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని

విజయవాడ: బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadhineni Yamini) వైసీపీ (YCP)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్‌ (Volunteers)ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్‌ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్ కల్చర్ పెరిగిపోయిందని ఆరోపించారు. విశాఖలో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచుల డ్రగ్స్ (Drugs) దొరకటం దారుణమన్నారు.

రాష్ట్ర పోలీసు శాఖ నిద్ర పోతోందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయటపెట్టారని సాధినేని యామిని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు. వాటివల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై కావాలనే నిందలు వేస్తున్నారన్నారు. ఎన్నికల్లో పురందేశ్వరి పరువు తియ్యటానికి వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌ను బీజేపీ ఖండిస్తుందన్నారు. ఓటమి భయ్యంతో వైసీపీ ఇలాంటి పనులు చేస్తోందని, అనవసరమైన నిందలు పురందేశ్వరిపై వేస్తే చర్యలు తప్పవని సాధినేని యామిని అన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 02:07 PM