Share News

Raja Singh : సీఎం రేవంత్ అలా చేయొద్దు... రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:42 PM

కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్(KCR) మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరించవద్దని హితవు పలికారు.

Raja Singh : సీఎం రేవంత్ అలా చేయొద్దు... రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్(KCR) మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరించవద్దని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)ని మెదట కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారని.. ఆ తర్వాత కనీసం ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరిగా మారకూడదని సూచించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ తెలియజేయాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అని సీఎం రేవంత్ సంబోధించటం శుభపరిణామమని రాజాసింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి

TS Politics: బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి కారణమదే..?: పల్లా రాజేశ్వర్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 04:43 PM