Share News

Mallu Ravi: ఇండియా కూటమిలో ఆ పార్టీ లేదు.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:17 PM

రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.

Mallu Ravi: ఇండియా కూటమిలో ఆ పార్టీ లేదు.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తుందని అన్నారు. స్క్రీనింగ్ జరిగిన తర్వాత ..సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. షెడ్యూల్ రాకముందే..రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నాయని అన్నారు. పార్లమెంటరి ఎన్నికలకు ప్రతి అసెంబ్లీలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని పొత్తులు పెట్టుకున్న గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కనీసం 14 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టామని అన్నారు. నగర్ కర్నూల్ పరిస్థితిని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నగర్ కర్నూల్ టికెట్ తనకు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సర్వేలు అన్ని తనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పెద్దన్నలా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని మల్లు రవి అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్‌నే వెళ్లి అడగాలని మీడియాతో అనడం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు భావిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని రేవంత్ కోరలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి వక్ర భాష్యం చెప్పడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఏ ప్రధాని ఉన్న తాము గౌరవిస్తామని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి మాట్లాడారన్నారు. కిషన్ రెడ్డి రాజకీయంగా కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలు, పేదలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. బీజేపీనే సంతోషంగా లేదని మల్లు రవి ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 09:17 PM