Share News

TS Politics: కవిత అరెస్ట్‌పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:38 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆరోపించారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అన్నారు. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పారని ఏమైంది..? అని ప్రశ్నించారు.

TS Politics: కవిత అరెస్ట్‌పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆరోపించారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అన్నారు. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పారని ఏమైంది..? అని ప్రశ్నించారు. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. వారు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారు. ఆమెను అరెస్టు చేస్తే సానూభూతి వచ్చి.. ఓట్లు డైవర్ట్‌ అవుతాయని.. తర్వాత కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేది ఆ పార్టీ నేతల ఆలోచన అని ఆక్షేపించారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పారు. రాహుల్‌ను ప్రధానిగా చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్సార్ హయంలో తనను ఇబ్బంది పెట్టారని అన్నారు. వైఎస్సార్ లాంటి నేతను తాను ఎదురించానని.. అలాంటి నేత తనపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. అప్పటి ఎస్పీ వ్యాస్ తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పారు.

వారు పోరాడుతుంటే.. కేసీఆర్ జాడ లేకుండా పోయారు

గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనపై ఆయన తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పారు. ఎన్నికల రోజు తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తనను 12 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారని.. అయిన తన వర్గమే ఆ ఎన్నికల్లో గెలిచిందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. కేసీఆర్‌ను పక్కన పెట్టడం వల్లే.. అప్పటి టీఆర్ఎస్ పార్టీను పెట్టారని.. తెలంగాణ కోసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడ లేరని చెప్పారు. పార్లమెంట్‌లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి, పెద్దపల్లి వివేక్ వెంకటస్వామి, సిరిసిల్ల రాజయ్య, మంద జగన్నాధం తెలంగాణ కోసం పోరాడారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ అంజన్ కూమర్ యాదవ్, సురేష్ షెట్కార్‌లు పార్టీ లైన్‌లో పని చేశారని వివరించారు. ఢిల్లీ గెస్ట్ హౌస్‌లో టీవీ చూసుకుంటూ కేసీఆర్ ఉన్నాడని చెప్పారు. తెలంగాణ ప్రకటించిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు.10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Updated Date - Feb 25 , 2024 | 05:58 PM